స్వగ్రామ ప్రజలకు తీపి కబురు తెలిపిన మంత్రి సీతక్క

ములుగు సీతక్క సొంత గ్రామ ప్రజలకు తీపి కబురు తెలిపి వారిలో సంతోషం నింపింది. ములుగు జిల్లాలో సీతక్క అంటే ఓ దేవతగా అంత కొలుస్తారు..ఏ విపత్తు వచ్చిన..ఎవరు ఆపదలో ఉన్న పగలు , రాత్రి అని ఆలోచించకుండా వారికీ సాయం చేయడం తో సీతక్క ముందుంటుంది. కరోనా సమయంలో కూడా సొంత డబ్బులతోనే కాకుండా అనేకమందిని ఫౌండ్స్ అడిగి అందరికి సాయం చేసింది. వరదల సమయంలో కూడా అప్పటి అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోయినా సీతక్క తనకు తోచిన సాయం చేసి ఆదుకుంది. అందుకే ప్రతిసారి ఆమెను నియోజకవర్గ ప్రజలు గెలిపించి తీరుతారు.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారు. పంచాయితీ రాజ్ , శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె వ్యవహరిస్తున్నారు. కాగా సీతక్క స్వగ్రామం జగ్గన్నపేట కు ఇంతవరకు బస్సు సౌకర్యం లేదు. రోడ్ బాగున్నప్పటికీ బస్సు సౌకర్యం లేకపోవడం తో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో సైతం గ్రామానికి బస్సు సౌకర్యం చేయాలనీ ర్టీసీ అధికారులను కోరింది. దీంతో బస్సు నడిపేందుకు ఆ రూట్‌ను ఆర్టీసీ బుధవారం పరిశీలించింది. వరంగల్-2 డిపోకు చెందిన అధికారులు సర్వే నిర్వహించారు. త్వరలోనే బస్సు నడిపిస్తామని వరంగల్‌-2 డిపో మేనేజర్‌ సురేశ్‌ తెలిపారు. పత్తిపల్లి-పొట్లాపూర్‌ మార్గంలో బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తామని, ఈ మేరకు ఆ రూట్‌లో సర్వే పూర్తి చేశామని వివరించారు. దీంతో తమ గ్రామానికి బస్సు సౌకర్యం రాబోతోందని జగ్గన్నపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.