తెలంగాణలో 24 గంటల్లో మరో 66 కేసులు

మొత్తం 766 కరోనా కేసులు

Another 66 cases in Telangana in 24 hours
Another 66 cases in Telangana in 24 hours

Hyderabad: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 66 కేసులు నమోదు అయ్యాయి.

దీంతో మొత్తం 766 కరోనా కేసులు.. రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 417 కేసులు రికార్డయ్యాయి.

రాష్ట్రం మొత్తం మీద 186 మంది డిశ్చార్జ్ కాగా, అందులో 131 మంది హైదరాబాద్ వాసులున్నారు.

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 13 జిల్లాలో 209 క్లస్టర్లలో 1, 09, 975 గృహాల్లో 4 లక్షల 39 వేల 900 మందిని వైద్య సిబ్బంది సర్వే చేయడం జరిగిందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇది ఇలా ఉంటే…సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ లైబ్రరిలో రెగ్యులర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతుండడంతో గాంధీ వైద్యలను సంప్రదించాడు.

కరోనా లక్షణాలుగా భావించి..వెంటనే ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో మరో రెండు కరోనా కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సూర్యాపేట జిల్లాలో మరో 15 కేసులు నమోదు కావడం జిల్లా వాసులను కలవర పెడుతోంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/