విద్యా వ్యవస్థ రూపురేఖలను మారుస్తున్నాం
పేదరికంపై పోరాటానికి విద్య ఒక ఆయుధం..సిఎం జగన్

అమరావతి: ఏపి దేశంలోని అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సిఎం జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజల జీవితాలను మార్చగల శక్తి విద్యకు మాత్రమే ఉందని అన్నారు. పేదరికం, అసమానత్వాలపై పోరాటానికి విద్య ఒక ఆయుధమని చెప్పారు. అమ్మఒడి, నాడునేడు, విద్యాదీవెన పథకాల ద్వారా రాష్ట్రంలో విద్యావ్యవస్థ రూపురేఖలను మారుస్తున్నామని తెలిపారు. ఈ పథకాల ద్వారా 100 శాతం అక్షరాస్యతను సాధించేందుకు ఒక మార్గాన్ని తయారుచేసుకున్నామని సిఎం జగన్ చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/