పీవీకి భారతరత్న ఇవ్వాలి..సిఎం కెసిఆర్‌

పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి..కెసిఆర్‌

cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభలో పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ.. పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు అని పేర్కొన్నారు. నూతన ఆర్థికసంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతికోవిదులు, బహుభాషావేత్త, దేశప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు అని తెలిపారు. భారత రాజకీయాలలో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి పాములపర్తి వెంకట నరసింహారావుకు మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలనీ, పార్లమెంట్ ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్నీ, చిత్తరువునూ ప్రతిష్ఠించాలనీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావుగారి పేరు పెట్టాలనీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/