పుష్ప 2 ట్రైలర్ రిలీజ్..పుష్ప గాడి రూల్

యావత్ అల్లు అర్జున్ అభిమానులు , సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 ట్రైలర్ రావడమే కాదు పుష్ప గాడి రూల్ అంటూ మోతమోగించింది. సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో పుష్ప పార్ట్ 1 రాగ..ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది. పుష్ప రిలీజ్ అయ్యి దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా నేపథ్యంలో పుష్ప 2 ట్రైలర్ కోసం కళ్లు కాయలుకాచేలా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో రేపు అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఓ రోజు ముందే అభిమానుల్లో పుట్టిన రోజు సంబరాలు మొదలుపెట్టారు పుష్ప మేకర్స్. శుక్రవారం మూడు నిమిషాల 17 సెకెన్ల నిడివి గల ట్రైలర్‌ను విడుదల చేసి సంతోష పెట్టారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..

‘‘తిరుపతి జైల్‌ నుంచి బులెట్‌ గాయాలతో తప్పించుకున్న పుష్ప…

ఆ ప్రయత్నంలో పోలీసులు పది రౌండ్లల కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలైన కూంబింగ్‌ ఆపరేషన్‌..

పుష్ప మరణించాడా.. బతికే ఉన్నాడా?

నెల రోజులు అయినా చల్లారని అల్లర్లు.. పలు చోట్ట కొనసాగుతున్న 144 సెక్షన్లు..

పుష్ప అసలు బతికే లేడని కొందరు అంటుంటే… అతను జపాన్‌, మలేషియా, చైనాలో ఉన్నాడని కొందరు అంటున్నారు..

బాక్రాపేట కొండపై ఎనిమిది బుల్లెట్‌ రంధ్రాలు, రక్తపు మరకలతో పుష్ప దుస్తులు కనుగొన్న సెర్చ్‌ టీమ్‌..

అంటూ న్యూన్‌ ఛానళ్లలో వార్తలు..

మరోవైపు అతని మద్దతుదారులు తిరుగుబాటు..

పుష్ప ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెప్తాండారు కానీ.. సంపాదించిన దుడ్డు ఏం చేస్తాండాడో చెప్తాండారా? అంటూ ఓ వ్యాపారి ప్రశ్న..

నా కొడుక్కి గుండె ఆపరేషన్‌ అంటే పుష్పనే దుడ్డు పంపించినాడప్ప… ఓ తల్లి కృతజ్ఞత..

నా బిడ్డ పెండ్లికి పుష్పనే డబ్బు సర్దుబాటు చేశాడు.. ఓ తండ్రి కృతజ్ఞత..

మాలాంటోళ్లకి కూడు పెడతాండు…

పుష్ప గురించి సామాన్యుల మాట..

ఇలా ఎన్నో ప్రశ్నలు… పరంపలు…

కట్‌ చేస్తే… అడవి.. అక్కడో పులి..

ఓ మనిషిని చూసి రెండు అడుగులు వెనక్కి తగ్గిన పులి..

‘‘అడవిలో జంతువులు రెండడుగు వెనక్కి వేసినాయంటే పులి వచ్చినాదని అర్థం..

అదే పులే రెండడుగులు వెనక్కి వేసిందంటే ‘పుష్ప’ వచ్చినాడని అర్థం’’ అంటూ సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచింది ట్రైలర్. ఒకరకంగా పుష్ప మొదటి భాగం అంతా తనకోసం కష్టపడుతున్నట్లు చూపించగా తర్వాత పుష్ప ఆ డబ్బంతా ప్రజల కోసం ఖర్చుపెట్టినట్లుగా ఇప్పుడు విడుదల చేసిన వీడియోలో క్లారిటీ ఇచ్చారు. అంతేకాక పుష్ప చనిపోయినట్లు భావిస్తున్న అందరికీ ఒక్కసారిగా అడవిలో పులుల కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలు పుష్ప కనిపించేటట్టు చేయడంతో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video