ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్ల‌ను పంపిస్తాం: బైడెన్‌

వాషింగ్టన్: రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపేందుకు అమెరికా సిద్ధమైంది. హైటెక్‌, మీడియం రేంజ్‌ రాకెట్‌ వ్యవస్థలను పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌ చేస్తున్న అభ్యర్థనను అమెరికా అంగీకరించినట్లు సమాచారం. రాకెట్‌ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు పంపే అంశంపై త్వరలోనే అమెరికా ఓ ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపబోమని సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో.. తేలికపాటి సామర్థ్యం ఉన్న రాకెట్లను మాత్రమే ఉక్రెయిన్‌కు పంపాలని అమెరికా అధికారులు యోచిస్తున్నారు. గరిష్ఠంగా 70 కిలోమీటర్ల రేంజ్‌ ఉన్న రాకెట్లను మాత్రమే.. ఉక్రెయిన్‌కు ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రాకెట్లను డాన్‌బాస్‌ ప్రాంతంలో తమపై భీకర దాడులు చేస్తున్న రష్యా సైన్యాన్ని నిలువరించేందుకు మాత్రమే ఉక్రెయిన్‌ ఉపయోగించాలనే షరతు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/