వర్మ కు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గిడుగు రుద్రరాజు వార్నింగ్ ఇచ్చారు. నిత్యం వివాదాస్పద చిత్రాలతో వార్తల్లో నిలిచే వర్మ..తాజాగా వ్యూహం మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనికి సంబదించిన టీజర్ విడుదల చేయగా..అది వివాదాస్పదంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ఏపీలో ఏర్పడిన పరిస్థితులు, సీఎం జగన్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? ఎలా నిలబడ్డారు? ఆయన మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఇలా ప్రతి అంశాన్ని చూపిస్తూ వర్మ వ్యూహం మూవీ తెరకెక్కించారు.

కాగా ఈ టీజర్ ఫై కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. ఉన్నవి లేనట్లుగా.. లేనివి ఉన్నట్లుగా చూపిస్తాడంటూ వర్మ ఫై ఫైర్ అయ్యారు. సంచలనాల కోసం ఈ సినిమాలో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీని కించపరిచేలా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. సోనియా గాంధీని కించపరిస్తే బట్టలూడదీసి కొడతామని ఘాటైన వ్యాఖ్యలు చేసారు. గాంధీ, నెహ్రూల కుటుంబాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వ్యూహం టీజర్ విడుదల తర్వాత ఆర్జీవీపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అప్పటి కాంగ్రెస్‌ అధిష్ఠానం, జగన్‌ను బెదిరించినట్లు ఈ టీజర్‌లో చూపించారు. అంతేకాదు.. జగన్‌ తలొగ్గకపోవడంతోనే సీబీఐ కేసులు, అరెస్టులతో ఇబ్బందులు పెట్టినట్లు వర్మ టీజర్‌లో చూపారు.

YouTube video