మహారాష్ట్రలో కేసీఆర్ రెండు రోజుల పర్యటన..పూర్తీ షెడ్యూల్ ఇదే

తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ ను విస్తరింప చేసే పనిలో ఉన్నారు. ఇప్పటీకే పలు జిల్లాలో పర్యటించిన కేసీఆర్..ఈ నెల 26, 27 తేదీల (రేపటి నుంచి) మహారాష్ట్ర పర్యటనలో బిజీ కానున్నారు. మహారాష్ట్రలోని పండరీపూర్‌, తుల్జాపూర్‌లో ఆలయాల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సోలాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న సభలో పాల్గొంటారు.

సోమవారం (జూన్ 26) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మహారాష్ట్రకు వెళ్లనున్నారు. రాత్రికి బస అక్కడే చేయనున్నారు. సోలాపూర్‌కు చెందిన స్థానికంగా పేరొందిన లీడర్ భగీరథ్‌ బాల్కే అనే వ్యక్తి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. సోలాపూర్‌లోని కొంత మంది మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల ఫ్యామిలీ కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉంది.

(మంగళవారం) ఉదయం సోలాపూర్‌లోని పండరీపూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి విఠోభారుక్మిణి మందిరంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత దారాశివ్‌ జిల్లాలోని శక్తి పీఠం తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మళ్లీ హైదరాబాద్ తిరుగుప్రయాణం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ప్రజా ప్రతినిధులు కూడా భారీ కాన్వాయ్‌గా తరలి వెళ్లనున్నారు.