రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే కారు

ఆ సమయంలో కారులో లేని మ్మెల్యే శ్రీధర్ రెడ్డి

ysrcp-mla-kotamreddy-car-suffered-with-and-accident

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెందిన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తెట్టు జంక్షన్ వద్ద శ్రీధర్ రెడ్డి కారు మరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీధర్ రెడ్డి కారు ముందు భాగం తుక్కుతుక్కు అయింది. ప్రమాద సమయంలో శ్రీధర్ రెడ్డి లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టైంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఇంటివద్దే ఉన్నారు. ఆ సమయంలో డ్రైవర్ మాత్రమే కారులో ఉన్నాడు. అయితే, అతనికి కూడా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు డ్రైవర్ ఒక పని మీద విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై కోటంరెడ్డి కూడా ఆరా తీశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/