కొనసాగుతున్న భవానీపూర్ ఉప ఎన్నిక పోలింగ్

మమత వర్సెస్ బీజేపీ


కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ (41) బీజేపీ తరపున మమతకు సవాల్ విసురుతున్నారు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఈ ఉదయం పటిష్ఠ భద్రత మధ్య ప్రారంభమైంది. గత ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలింగుకు ముందు బీజేపీ అభ్యర్థి ప్రియాంక మాట్లాడుతూ.. కేంద్ర పారా మిలిటరీ బలగాల బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భవానీపూర్‌లో మమత విజయం సాధిస్తే మరో ఐదేళ్లపాటు ఆమెకు సీఎంగా ఎదురుండదు. కానీ ఓడితే పరిస్థితి ఏంటన్న దానిపై రాజకీయ పరిశీలకులు ఇప్పటి నుంచే విశ్లేషణలు మొదలుపెట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/