చిత్రసీమలో విషాదం : ప్రియుడు మోసం చేయడంతో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

చిత్రసీమలో విషాదం : ప్రియుడు మోసం చేయడంతో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

ఫిలిం నగర్ లో ఘోరం చోటుచేసుకుంది. ప్రియుడు మోసం చేయడం తో జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పీఎస్‌ పరిధిలోని ఫిలింనగర్‌ జ్ఞాని జైల్‌ సింగ్‌ నగర్‌ బస్తీలో నివాసం ఉంటున్న జూనియర్‌ ఆర్టిస్ట్‌ అనురాధకు కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కిర‌ణ్ త‌న‌ని పెళ్లి చేసుకుంటాడ‌ని భావించిన అనురాధ కొన్నాళ్లుగా అత‌నితోనే ఉంటుంది. అయితే ఇటీవ‌ల అత‌డు మరో యువ‌తిని ఎంగేజ్‌మెంట్ చేసుకోవ‌డంతో ఆమె ఆ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోయింది. అత‌నితో తీవ్ర వాగ్వాదం పెట్టుకుంది.

కిర‌ణ్ ఆమెపై గ‌ట్టిగా అరిచి అక్క‌డ నుండి వెళ్లిపోవ‌డంతో అనురాధ మ‌న‌స్తాపానికి గురై త‌న గ‌దిలో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమె గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. మృతురాలి సోదరి సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కిరణ్‌పై నిందితుడిపై ఐపీసీ 306, 509, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.