ప్రారంభమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్

Voting begins for 1st phase of Gujarat Assembly polls

అహ్మదాబాద్‌ః గుజరాత్‌ అసెంబ్లీ మొదటి విడుత ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం ఎన్నికల సంఘం 14,382 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. తొలి విడుతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాల్లో 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

బిజెపి, కాంగ్రెస్‌, ఆప్‌ సహా 36 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నాయి. బిజెపి, కాంగ్రెస్‌ మొత్తం సీట్లలో అభ్యర్థులను నిలపగా, ఆప్‌ 88 స్థానాల్లో, బీఎస్పీ 57 మందిని నిలబెట్టింది. వీరితోపాటు 339 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 5న మలివిడుత పోలింగ్‌ జరుగనుంది. డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/