ఈనెల 10న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణ సర్కార్ తాజాగా తీసుకొచ్చిన 317 జీవోను మళ్లీ సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తూవస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 10న రాష్ట్రవ్యాప్త బంద్ కు బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ బంధు కు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు.

ఇక రేపు గురువారం హన్మకొండలో చత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ దీక్షలో పాల్గొననున్నారు. కొందరు నేతలు పోలీసులను ఉపయోగించుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. పోలీసులు ఖాకీ చొక్కాలకు బదులు.. గులాబీ చొక్కాలు వేసుకోవాలని తరుణ్ చుగ్ తీవ్రంగా విమర్శించారు. కోర్టులో తమకు న్యాయం జరిగిందని తరుణ్ చుగ్ అన్నారు.

ఇదిలా ఉంటె జన జాగరణ దీక్ష లో కోవిడ్ నిబంధనలు పాటించలేదని సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. మూడ్రోజుల పాటు జైల్లో ఉన్న సంజయ్..బుధువారం హైకోర్టు సంజయ్‌ను విడుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం తో ఆయన బయటకు వచ్చారు. సంజయ్​ విడుదల నేపథ్యంలో కరీంనగర్‌ జైలు వద్దకు భారీగా భాజపా కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ..ప్రభుత్వం జీవో 317 సవరించినపుడే సంతోషిస్తా. మరోసారి జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో భాజపానే అధికారంలోకి వస్తుంది. ఉద్యోగులకు భాజపా పూర్తి అండగా ఉంటుంది. హక్కుల కోసం ఉద్యోగులు చేసే పోరాటానికి అండగా ఉంటాం. ఉద్యోగాలు పోతే అధికారంలోకి వచ్చాక ఇప్పించే బాధ్యత మాది. తెలంగాణ సమాజం, రైతులు, ఉద్యోగుల కోసమే భాజపా పోరాటం. ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైందన్నారు.