తెలంగాణ లో కొత్త మద్యం ఫై జూపల్లి క్లారిటీ..

తెలంగాణ లో కొత్త మద్యం రాబోతుందని..ప్రస్తుతం ఉన్న కొన్ని బీర్ల ను బ్యాన్ చేయబోతున్నారని వార్తలపై మంత్రి జూపల్లి క్లారిటీ ఇచ్చారు. నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్‌కు సరఫరా చేసేందుకు అనుమతించినట్లు పేర్కొన్నారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని గతంలోనే చెప్పను..ఇప్పుడు కూడా ఆ మాట కు కట్టుబడి ఉంటానని.. తన వద్దకు ఏ ఫైల్ రాలేదన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం బేవరేజెస్ కార్పోరేషన్‌కు ఉందన్నారు.

ఈ క్రమంలోనే సోమ్ డిస్టిలరీస్ కు అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేసారు. కానీ కొన్ని పత్రికలు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ – సప్లైని బట్టి కొత్త కంపెనీలకు బేవరేజెస్ కంపెనీ అనుమతులు ఇస్తుందని గుర్తించాలన్నారు. సోమ్ డిస్టిలరీస్ రెండు దశాబ్దాలుగా… 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు.