ఏపీలో మరో వాలంటీర్ చేతివాటం..మహిళ ఖాతాలోని రూ. 1.70 లక్షలు మాయం

ఏపీలో వాలంటీర్ల నేరాలు ఆగడం లేదు..హత్యలు , మానభంగాలు , డబ్బులు కాజేయడం ఇలా ఎన్నో చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ..ప్రభుత్వం ఫై విమర్శలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే పలువురి వాలంటీర్ల బాగోతాలు బయటపడగా..తాజాగా మరో వాలంటీర్ తన చేతివాటం చూపించాడు. మహిళ ఖాతాలోని రూ. 1.70 లక్షలు కాజేసాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం లో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కొట్ర నాగమణి ఇటీవల తన ఖాతాలో రూ. 13,500 జమచేసింది. అనంతరం తన ఖాతాలో మొత్తం ఎంత ఉందని బ్యాంకు అధికారులను అడగ్గా, ఇప్పుడు జమచేసిన మొత్తం మాత్రమే ఉందని చెప్పడంతో ఆమె షాక్ కు గురైంది. ఈ మధ్య తాను డబ్బులు తీసుకోలేదని చెప్పడం తో..బ్యాంకు అధికారులు స్టేట్‌మెంట్లు పరిశీలిస్తే.. వేలిముద్ర ద్వారా రూ. 1.70 లక్షలు కాజేసినట్టు గుర్తించారు. వలంటీరు తన వేలిముద్రలు తీసుకుని నగదు డ్రా చేసి మోసం చేశాడని నాగమణి గుర్తించి , పోలీసులకు పిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేపడుతున్నారు.