తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై వివేక్ ఆగ్రహం

తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరు గొంతెత్తి మాట్లాడతారో వాళ్ళను అనిచి వేయడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ పైన ప్రసారం చేస్తోన్న విధానాలు సీఎంకి నచ్చడం లేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలో కోట్లల్లో స్కామ్ నడుస్తోందని ఆరోపించారు. కేవలం కమిషన్స్ కోసమే ప్రోజెక్ట్ లు నిర్మిస్తున్నారని, కాళేశ్వరంతో రైతులకు ఉపయోగం లేదని ఆయన అన్నారు.

తీన్మార్ మల్లన్న అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్న ఫ్యామిలీకి తన సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. మల్లన్న ఇప్పటివరకూ ఎన్నో సమస్యలపై పోరాడాడని, కాళేశ్వరం అవినీతిపైనా మాట్లాడాడని చెప్పారు. అంతేకాదు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మల్లన్నకు లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయని ఆయన గుర్తు చేశారు.