అమిత్ షాపై మరోసారి కెటిఆర్ ఫైర్

minister-ktr-fires-on-central-home-minister-amit-shah

సిరిసిల్లః మంత్రి కెటిఆర్‌ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన రైస్‌ మిల్‌ను మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. లబ్దిదారులను రైస్ మిల్ యూనిట్ స్థాపన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనతరం మాట్లాడుతూ.. రైస్‌మిల్‌ను స్థాపించాలనుకోవడం గొప్పనిర్ణయమన్నారు. రైస్‌మిల్‌ యూనిట్‌ విజయవంతంగా నడవాలని, రాష్ట్రం మొత్తానికి ఇది ఆదర్శంగా నిలవాలని చెప్పారు. మిగతా లబ్దిదారులకు కేస్‌ స్టడీగా మారాలని ఆకాంక్షించారు.

సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యతా దినోత్సంగా జరిపామన్నారు. విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని కొందరు అడుగుతున్నారని.. ఆగస్టు 15ను స్వాతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామని ప్రశ్నించారు. త్యాగాలు, పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవడం ముఖ్యమని సూచించారు. పాత ఖైదీగా వ్యవహరించడం మాని.. భవిష్యత్‌ నిర్మాణంపై దృష్టి పెట్టాలని హితవుపలికారు.