తమిళ్ లో రిలీజ్ కు సిద్దమైన విరూపాక్ష

Virupaksha Movie Talk ..

తెలుగు లో సూపర్ హిట్ సాధించిన విరూపాక్ష మూవీ..ఇప్పుడు తమిళ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు రూపొందించిన హర్రర్ మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించగా , శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు మిగతా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తమిళ వెర్షన్ మే 5 న రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ అయిన KE జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్.. ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. తమిళనాడు వ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్లు ‘విరూపాక్ష’కు కేటాయిస్తున్నారు. ఇక ఈ మూవీ తెలుగు లో వారం లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.66 కోట్లు షేర్‌, రూ. 57.20 కోట్లు గ్రాస్ వసూలు చేసి తేజ్ కెరియర్ లోనే రికార్డు నెలకొల్పింది.