రీసౌండ్ చేస్తోన్న చరణ్.. ఎక్కడో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో బిగ్గె్స్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ఏదని అడిగితే ఠక్కున గుర్తుకొచ్చేవి మగధీర మరియు రంగస్థలం చిత్రాలు. ఈ రెండు సినిమాలు చరణ్ కెరీర్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయని చెప్పాలి. మగధీర చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, రంగస్థలం చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించాడు. ఇక రంగస్థలం చిత్రంలో చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మె్న్స్ ఇచ్చాడని ఆయన నటనకు అదిరిపోయే ప్రశంసలు దక్కాయి.

ఈ సినిమాలో చెవిటి పాత్రలో చరణ్ యాక్టింగ్‌కు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాను కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేయగా, తాజాగా ఈ సినిమాను తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా తమిళ రీమేక్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమాను తమిళంలో ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా రంగస్థలం చిత్రాన్ని తమిళంలో ‘రీసౌండ్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్ర ట్రైలర్ తమిళంలో ఎలాంటి రీసౌండ్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.