GHMC నిర్లక్ష్యానికి చిన్నారి మృతి..

GHMC నిర్లక్ష్యానికి చిన్నారి మృతి చెందింది. మ్యాన్‌హోల్‌లో పడి మౌనిక(6) అనే చిన్నారి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. శనివారం ఉదయం నగరంలో భారీ వర్షం పడింది. ఇదే క్రమంలో కళాసిగూడలో పాల పాకెట్ కోసం వెళ్లిన మౌనిక మ్యాన్ హోల్ లో పడింది. వర్షానికి GHMC సిబ్బంది మ్యాన్ హోల్ తెరిచి ఉంచారు అది గమనించని చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా అందులో పడింది. దీంతో చిన్నారి ఊపిరాడక మృతి చెందింది.

పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని DRF సిబ్బంది గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు మ్యాన్‌హోళ్లలో పడి చనిపోతూనే ఉన్నారు. GHMC అధికారులు… తెరచివున్న మ్యాన్ హోళ్లను మూసివేయించకుండా.. నిర్లక్ష్యంగా వదిలేస్తుండటంతో… వానలు పడినప్పుడు… వాటిలో పడి చనిపోతున్నారు.