4 రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన విరూపాక్ష

సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. నాల్గు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్ లో చేరి తేజ్ కెరియర్ లోనే రికార్డు గా నిలిచింది. సాయిధరమ్ తేజ్ – సంయుక్త మీనన్ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 21 న గ్రాండ్ గా విడుదలైంది.

మొదటి రోజు మొదటి ఆట తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను చూసేందుకు పోటీపడుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 12 కోట్లు .. రెండో రోజు 28 కోట్లు .. మూడో రోజు 44 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, నాల్గో రోజుతో 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. సాయితేజ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా .. ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లను సాధించిన సినిమాగా ఇది నిలవడం విశేషం.

మరోపక్క పబ్లిక్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని థియేటర్ల సంఖ్యను కూడా భారీగా పెంచారు. నైజాంలో 240 స్క్రీన్లు, సీడెడ్‌లో 165 స్క్రీన్లు, ఆంధ్రాలో 310 స్క్రీన్లతో కలిపి మొత్తంగా 715 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 85 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 220 స్క్రీన్లతో మొత్తంగా ఈ సినిమాను 1020 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం పబ్లిక్ డిమాండ్ కారణంగా మరిన్ని థియేటర్లను పెంచుతున్నట్టు తెలుస్తున్నది.