పవన్ బాడీ లాంగ్వేజ్ ను అనుకరించబోతున్న తమన్నా..?

మిల్క్ బ్యూటీ తమన్నా ..పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ను అనుకరించబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం తమన్నా..మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో నటిస్తుంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది.

ఇప్పటికే సినిమా తాలూకా షూటింగ్ చాల వరకు పూర్తైంది. ప్రస్తుతం కోల్ కత్తా లో కీలకమైన షెడ్యూల్ జరుగుతోంది. ఇక ఈ మూవీ లో తమన్నా ఓ ఫేమస్ లాయర్ పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని పిక్స్ కూడా బయటకు వచ్చేశాయి. ప్రస్తుతం కోల్కతా షెడ్యూల్లో ఆమెపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తమన్నా కోర్టు సన్నివేశాల్లో ‘వకీల్ సాబ్’ మూవీలోని పవన్ బాడీ లాంగ్వేజ్ ను అనుకరించబోతుందని వినికిడి. అంతేకాదు ‘అబ్జెక్షన్ అబ్జెక్షన్’ అంటూ డైలాగులు కూడా చెప్పబోతుందట. ఈ సీన్స్ అన్నీ హిల్లీరియస్గా వచ్చాయని అంటున్నారు. ఈ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ కాబోతుందని టాక్.

ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఇందులో చిరంజీవి కోల్కతాలో నివసించే ఓ ట్యాక్సీ డ్రైవర్గా నటిస్తోన్నాడు. ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.