మహిళా రెజ్లర్ల పిటిషన్‌పై ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు

SC issues notice on wrestlers’ plea seeking FIR against WFI chief

న్యూఢిల్లీః మహిళా రెజ్లర్ల వినతిపై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై పలువురు ప్రముఖ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్నారు.తమపై లైంగిక వేధింపులు సాగుతున్నాయని అంతర్జాతీయ మహిళా రెజ్లర్లు ఆరోపించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీచేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 28వతేదీ శుక్రవారం జరగనుంది.