ఏపి నుండి ఢిల్లీకి ప్రారంభమైన కిసాన్‌ రైలు

Virtual Launching of Kisan Train by Hon’ble CM of AP & Hon’ble Union Minister for Agriculture

అమరావతి: అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్‌ రైలు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌, ఏపి సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కిసాన్‌ రైలు అనంతపురం రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరింది. కాగా ఆగస్ట్‌ 7న మహారాష్ట్రలో తొలి కిసాన్‌ రైలును ప్రారంభించగా, ఇది రెండో రైలు. అక్టోబర్‌ నుంచి రైలును పూర్తిస్థాయిలో నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/