మరో నాలుగు కులాలకు వైఎస్‌ఆర్ చేయూత పథకం
అర్హత ఉన్నా లబ్ధి పొందలేకపోతున్న వైనం

అమరావతి: బుడగ జంగం, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతొ ఒరియా కులాల వారికి కులధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే వైఎస్‌ఆర్ చేయూత పథకం వర్తింపు జేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, నాలుగు కులాల వారు పలు కారణాల వల్ల కులధ్రువీకరణ పత్రాన్ని పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం కార్యాలయ ఆదేశాల మేరకు స్వయం కులధ్రువీకరణ పత్రంతోనే అర్హులకు వైఎస్‌ఆర్ చేయూత పథకాన్ని అందించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల్లో 45-60 ఏళ్ల మధ్య ఉండే మహిళలకు నాలుగు విడతల్లో రూ.75 వేలు చెల్లించే వైఎస్‌ఆర్ చేయూత పథకాన్ని గత నెల 12న ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకానికి ఈ నాలుగు కులాల వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టినట్టు సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/