సిద్ధమవుతున్న విజయవాడ పశ్చిమ బైపాస్

విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు అతి త్వరలో బ్రేక్ పడబోతోంది. కాజా టోల్ ప్లాజా నుంచి చిన్నఅవుటపల్లి మధ్య నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. 48KM మేర 6 వరుసలతో నిర్మిస్తున్న ఈ బైపాస్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. 2021లో ఈ బైపాస్ పనులు మొదలవగా.. భూసేకరణలో సగం ఖర్చును రాష్ట్రం భరించింది.

చెన్నై-కోల్ కత్తా హైవేపై వెళ్లే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా బైపాస్ నిర్మించారు. చిన్న అవుటపల్లి-గొల్లపూడి మార్గం 30 కి.మీ పనులు ఫిబ్రవరి 2021లో & గొల్లపూడి – చిన్నకాకాని 17.88 కి.మీల పనులు జూలై 2021లో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో కాంట్రాక్టర్లకు అప్పగించారు. వాస్తవానికి ఈపాటికే అందుబాటులోకి రావాల్సిన విజయవాడ పశ్చిమ బైపాస్‌ విద్యుత్‌ లైన్ల మార్పిడి కారణంగా జాప్యం జరిగింది.