ఫోటో వైరల్ : హాస్పటల్ లో బెడ్ పైన తారకరత్న

గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ చికిత్స పొందుతున్న తారకరత్న కు సంబదించిన ఫోటో వైరల్ గా మారింది. హాస్పటల్ లోని బెడ్ ఫై ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. శుక్రవారం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం లోని హాస్పటల్ కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ కు తరలించారు. గత మూడు రోజులుగా ఇక్కడే చికిత్స అందిస్తున్నారు.

తారకరత్న ఆరోగ్యానికి సంబదించిన తాజా హెల్త్ బులిటిన్ ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ విడుదల చేసింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషయంగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. తారకరత్నకు ఎలాంటి ఎక్మో పెట్టలేదని.. మీడియా లో ప్రచారం అవుతున్న దాంట్లో నిజం లేదని డాక్టర్స్ తేల్చి చెప్పారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అభిమానులకు సమాచారం అందిస్తున్నారని, తారకరత్న ఆరోగ్యంలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే తప్పకుండా పంచుకుంటామని నారాయణ హృదయాలయ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. అభిమానులు, పార్టీ కార్య కర్తలెవరు కూడా తారకరత్నను చూసేందుకు రావొద్దని, చికిత్సకు అంతరాయం కలగకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా ఉందని డాక్టర్స్ మరోసారి చెప్పడం తో అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.