రసాయనశాస్త్రంలో ఇద్ద‌రికి నోబెల్‌

జన్యుకత్తెర విధానానికి రూపకల్పన చేసిన శాస్త్రవేత్తలు

Two women jointly win Nobel Prize for chemistry

స్టాక్‌హోం: ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వివిధ శాస్త్ర రంగాల్లో వరుసగా నోబెల్ ప్రైజులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రసాయనశాస్త్రంలో అవార్డుకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించింది. అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఎ దౌడ్నా, ఇమ్మాన్యుయెల్లే చార్పెంటీర్ 2020కి గాను కెమిస్ట్రీలో నోబెల్ విజేతలుగా నిలిచారు. జన్యువులో మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా వీరు ఓ కొత్త విధానానికి రూపకల్పన చేశారు. ఓ జీవి డీఎన్ఏ జన్యుపటాన్ని సవరించడమే కాకుండా, దాన్ని నియంత్రించేందుకు జీనోమ్ ఎడిటింగ్ విధానాన్ని ఆవిష్కరించారు. ఒక విధంగా చెప్పాలంటే ఓ జీవి డీఎన్ఏను మార్చడం ఇకపై ఎంతో సులువు. అది జంతువైనా, మొక్క అయినా సరే… అత్యంత కచ్చితత్వంతో తాము కోరుకున్న జన్యువును ఎంతమేర మార్చవచ్చో అంతమేర మాత్రమే మార్పులు చేసుకోవడం సాధ్యమవుతుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/