రేపే నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్.. ఈరోజు నుంచే కౌంటౌన్

జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. రేపు సాయంత్రం 5.35 గంటలకు ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్లోని రెండో ప్రయోగ వేదికలో జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 రాకెట్ అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంటౌన్ ప్రారంభంకానుంది. ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహం వాతావరణ రంగంలో సేవలందించనుంది.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. 2,275 కిలోల బరువు గల కలిలగిన INSAT 3DS ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అంతా సిద్దహయింది. వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఈ రాకెట్ ను షార్ ప్రయోగించనుంది. ఇస్రోలో ఈ మేరకు అంతా సిద్ధం చేసింది. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని యావత్ భారతదేశం కోరుకుంటుంది.