షూటింగ్స్ కు బాలకృష్ణ లాంగ్ బ్రేక్..?

నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ లకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సినీ , రాజకీయ వర్గాలు. ప్రస్తుతం బాలకృష్ణ ఓ పక్క సినిమాలు చేస్తూనే..మరోపక్క హిందూపురం ఎమ్మెల్యే గా బాధ్యతలు చేస్తున్నాడు.

ఇలా రెండు చూసుకుంటూ వస్తున్నా బాలయ్య..మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినిమాల షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి..పూర్తిగా ప్రచారంలో బిజీ కావాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న సినిమాల తాలూకా మేకర్స్ కు ఈ విషయాన్నీ తెలియజేసాడట. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఆయన ఓ మూవీ చేస్తున్నారు.