విజయవాడ లో ఏర్పటు చేసిన క్రాకర్స్ స్టాల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం ..ఇద్దరు మృతి

దీపావళి సంబరాలు దేశ వ్యాప్తంగా మొదలయ్యాయి. ఊరు, వాడ , పల్లె , పట్టణం ఇలా అన్ని చోట్ల దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ లో విషాదం చోటుచేసుకుంది. క్రాకర్స్ స్టాల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరి ప్రాణాలు పోయాయి. విజయవాడ గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో మెుత్తం 18 క్రాకర్స్ స్టాల్స్ ఏర్పాటు చేసారు. కాగా వీటిలో కొన్ని స్టాల్స్ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో క్రాకర్స్ భారీ శబ్ధంతో పేలాయి. క్షణాల్లో స్టాల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. స్టాల్స్ నిర్వహకులు, స్థానికులు భయంతో గ్రౌండ్ బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలిసింది.

మృతులు బాణసంచా దుకాణంలో పనిచేసే బ్రహ్మ, కాశీగా పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదంలో 15, 16, 17వ నంబర్‌ దుకాణాలు పూర్తిగా ఆహుతి అయ్యాయి. ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహకులు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారు. నేడు ఆదివారం సెలవు రోజు కావటంతో క్రాక్సర్స్ కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున కోనుగోలుదారులు జింఖానా మైదానానికి వస్తున్నారు. ఈక్రమంలో అనుకోకుండా ఓ క్రాకర్స్ స్టాల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది.