పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. నిన్న శనివారం అమిత్ షా పుట్టిన రోజు. ఈ సందర్బంగా బిజెపి నేతలు మాత్రమే కాదు ఇతర పార్టీ నేతలు సైతం పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు.

వీరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. దేశం ఐక్యంగా ఉండటం కోసం.. ఆంతరంగికంగా సురక్షితంగా ఉండటం కోసం షా నిరంతరం శ్రమిస్తున్నారని పవన్ హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు బదులిచ్చిన అమిత్ షా.. ‘నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు’ అంటూ జనసేనానిని ట్యాగ్ చేశారు.