అంబేడ్కర్ విగ్రహం పేరుతో రూ.258 కోట్లు నొక్కేశారు – టీడీపీ ఆరోపణ

దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ భారీ విగ్రహాన్ని విజయవాడ వేదికగా వైసీపీ సర్కార్ నిర్మించారు. దాదాపు 210 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రూ.170కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.404.35 కోట్లకు చేరింది. స్మృతి వనంలో DR BR అంబేద్కర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, 2వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాటర్‌బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్, లాంగ్ వాక్‌ వేస్‌తో డిజైన్ అసోసియేట్స్ తీర్చిదిద్దింది.

కాగా ఈ విగ్రహ ఏర్పాటు లో భారీగా అవినీతి జరిగినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. విగ్రహానికి అయిన ఖర్చు రూ.146 కోట్లే అని మిగతా డబ్బంతా అంబేడ్కర్ విగ్రహం పేరు చెప్పి వైసీపీ & కో నొక్కేసిందని టిడిపి ఆరోపిస్తుంది. మరి దీనిపై వైసీపీ నేతలు ఏమంటారో చూడాలి.