టిఆర్ఎస్ నేతలను డంపింగ్ యార్డ్ వద్ద కట్టేయాలని – బండి సంజయ్

టిఆర్ఎస్ నేతలను డంపింగ్ యార్డ్ వద్ద కట్టేయండి అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దమ్మాయిగూడ చౌరస్తా సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలను డంపింగ్ యార్డ్ వద్ద కట్టేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని దమ్మయిగుడ లో కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో దారి వెంట ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జవహర్ నగర్, దమ్మాయిగూడా ప్రజలు..ప్రధానంగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ను తరలించాలని సంజయ్ ని కోరారు.

ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ నేతలను డంపింగ్ యార్డ్ వద్ద కట్టేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్… మీకు మానవత్వం ఉంటే జవహర్ నగర్ కు రావాలని అన్నారు. బీజేపీకి అధికారమివ్వండి.. డంపింగ్ యార్డ్ సంగతి తేలుస్తామన్నారు బండి సంజయ్. మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆస్తులను కెసిఆర్ తనఖా పెట్టాడని ఆరోపించారు. రోడ్లు కూడా వేయలేని దుస్థితి కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. రూ.110 కోట్లతో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానన్న ట్విట్టర్ టిల్లు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ నేతలు భూకబ్జాలతో కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ను అభినవ అంబేద్కరని కలెక్టర్ పొగడటమా? ఆదివాసీ రాష్ట్రపతి అభ్యర్ధికి ఓటేయని కేసీఆర్ గిరిజనుకు రిజర్వేషన్లు ఇస్తారట అని ఎద్దేవా చేశారు. వెంటిలేటర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని… ఉఫ్ మని ఊదితే కూలిపోతుందన్నారు. టీఆర్ఎస్ నేతలకు ఈడీ అంటే కోవిడ్… సీబీఐ అంటే కాలు విరుగుతోందని ఎద్దేవా చేశారు.