దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి

మన రాష్ట్రంలో జరుగుతున్నన్ని దారుణాలు ఎక్కడా జరగడం లేదు

nakka anand babu
nakka anand babu

అమరావతి: దాడి అనేది ఒకసారి జరిగితే పొరపాటున జరిగిందని అనుకోవచ్చని, కానీ ఈ దారుణాలు నిత్యకృత్యంగా మారాయని టిడిపి నేత నక్కా ఆనందబాబు చెప్పారు. ఏపిలో దళితులపై జరుగుతున్నన్ని వేధింపులు, దాడులు, హత్యలు, శిరోముండనాలు మరే రాష్ట్రంలో జరగడం లేదని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేసిన ఘటనను మరువక ముందే విశాఖలో శ్రీకాంత్ అనే మరో దళిత యువకుడిని దారుణంగా కొట్టి, గుండుకొట్టించారని విమర్శించారు. ప్రభుత్వ మద్యం పాలసీని ప్రశ్నించిన ఓంప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని చెప్పారు. దళితుల ఉన్నతి కోసం వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఏమీ చేయకపోయినా పర్వాలేదని, కానీ దారుణంగా మాత్రం వ్యవహరించవద్దని కోరారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/