ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్..రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు

ప్రొఫెసర్ కోదండరామ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఉత్తర్వులు వచ్చాయి. కోదండరామ్‌తో పాటు అమరుల్లా ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర తెలపడంతో వీరికి కీలక పదవి దక్కినట్లు అయ్యింది. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అనేక వర్గాలను, సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన కృషి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్‌కు కీలక పదవి వస్తుందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైంది.

అలాగే టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. కమిషన్ సభ్యులుగా మాజీ ఐపీఎస్ అధికారిణి అనితా రాజేంద్రం, పాల్వాయి రజనీ కుమార్, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావులను నియమించారు.