బీఆర్‌ఎస్‌ ఫై సెటైర్లు వేసిన విజయశాంతి

కాంగ్రెస్ నేత విజయశాంతి ఛాన్స్ దొరికినప్పుడల్లా బిఆర్ఎస్ ఫై విమర్శలు , కౌంటర్లు , సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా లోక్ సభ ఎన్నికల తరుణంలో బిఆర్ఎస్ ఫై తనదైన సెటైర్లు వేసింది. బీఆర్‌ఎస్‌ను భవిష్యత్ రహిత సమితిగా తెలంగాణ ప్రజలు నిర్ణయించారని విజయశాంతి వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పొరుగు రాష్ట్రాల్లో 50 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పొచ్చంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌ నిర్దేశించుకున్న పెద్ద కార్యాచరణ ముందు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు చిన్నవని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్‌ కు ప్రస్తుతమున్న అతి పెద్ద కార్యాచరణ ముందు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు చాలా చిన్నవి. ప్రకటించుకున్న జాతీయ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లల్ల లక్షలాది ప్రజలు వారి నాయకత్వం కోరుకుంటున్నారని గతంలో ఎన్నోమార్లు తెలంగాణ ప్రజల ముందు ప్రగల్భాలు ఘనంగా చెప్పుకున్న సంఘటనల దృష్ట్యా ఆయా రాష్ట్రాలల్ల అత్యవసరంగా పనిచేసి “భవిష్యత్ రహిత సమితి” అని..బీఆర్ఎస్‌ కు ప్రస్తుతమున్న అతి పెద్ద కార్యాచరణ ముందు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు చాలా చిన్నవి. ప్రకటించుకున్న జాతీయ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లల్ల లక్షలాది ప్రజలు వారి నాయకత్వం కోరుకుంటున్నారని గతంలో ఎన్నోమార్లు తెలంగాణ ప్రజల ముందు ప్రగల్భాలు ఘనంగా చెప్పుకున్న సంఘటనల దృష్ట్యా ఆయా రాష్ట్రాలల్ల అత్యవసరంగా పనిచేసి “భవిష్యత్ రహిత సమితి” అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

తెలంగాణల సుమారు 14 స్థానాలు అమ్మ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గారు, శ్రీమతి ప్రియాంక గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంల నేతలు, కార్యకర్తల పోరాటంతో కాంగ్రెస్ గెలిచి, ఒక మూడు స్థానాలు ఎట్లనో ఒకవేళ బీఆర్ఎస్‌ వస్తే, మిగతా పై రాష్ట్రాలల్ల సుమారు 50 స్థానాలు గెలిచి, కేసీఆర్ గారు కేంద్రంల కారు చక్రం తిప్పచ్చు’’ అంటూ ట్విట్టర్ వేదికగా విజయశాంతి చెప్పుకొచ్చారు.