నిజామాబాద్‌లో విషాదం : గుండెపోటుతో బాలుడి మృతి

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు పెద్ద ఎత్తున సంభవిస్తున్నాయి. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా గుండెపోటు తో మరణిస్తున్నారు. ఒకప్పుడు 60 ఏళ్ల పైబడిన వారే గుండెపోటుతో మరణించే వారు కానీ..కరోనా తర్వాత వయసు తో సంబంధం లేకుండా గుండెపోటులు వస్తున్నాయి. అప్పటికి వరకు ఎంతో సంతోషంగా మనతో ఉన్న వారు సడెన్ గా కుప్పకూలిపోయి..మరణిస్తున్నారు.

తాజాగా నిజామాబాద్‌లో ఇదే జరిగింది. గుండెపోటుతో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో జరిగింది. తాళ్లపల్లి సుశాంత్ ముస్తాబాద్ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చిన అతడు నిన్న ఛాతిలో నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కళ్లముందు బిడ్డ చనిపోయేసరికి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.