విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఎప్పటి నుండే అంటే..

తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పండగ చాల ప్రాముఖ్యమైంది. తెలంగాణ లో కంటే ఆంధ్ర లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఫిక్స్ చేసాయి.

ఇప్పటికే ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఏపీలో జనవరి 11 వ తేదీ నుంచి, 16 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 17 వ తేదీన, స్కూళ్లు తిరిగి, తెరుచుకొ నున్నాయి. ఇక ఇంటర్ కాలేజీలకు జనవరి 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జనవరి 13 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. కాలేజీలకు కూడా ఇవే సెలవులు వర్తించే, అవకాశం ఉంది. అయితే, భోగి, సంక్రాంతికి రెండో శనివారం,ఆదివారం వస్తోంది.