వైసీపీ పార్టీలో తీవ్ర విషాదం : మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

వైసీపీ పార్టీ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి బుధవారం నాడు కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

గుంటూరు లో ఆయన మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాడు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఎంవీ రమణారెడ్డి ఒకరు. గుంటూరులో ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే ఆయన కవిత అనే మాసపత్రికను ప్రారంభించారు.ఆ తర్వాత ప్రభంజనం అనే పక్షపత్రికను కూడ ఆయన నడిపారు.

1983లో ఆయన ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలం పాటు టీడీపీలో కొనసాగారు. రాయలసీమ అభివృద్ది కోసం ఆయన పరితపించాడు ఈ విషయమై ఎన్టీఆర్ తో ఆయన విబేధించారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. రాయలసీమ విమోచన సమితిని ఏర్పాటు చేశారు. రాయలసీమ అభివృద్ది కోసం ఆయన పాదయాత్ర కూడా చేశారు. నిరంతరం రాయలసీమ హక్కుల కోసం పరితపించిన ఆయనకు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.