మంత్రి రోజాకు సీఎం జగన్ ఊహించని షాక్

నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ఆమెను పార్టీ మహిళా అధ్యక్షురాలి పదవిలో నుంచి తప్పించి ఆ స్థానంలో ఎమ్మెల్సీ పోతుల సునీతను నియమించారు. రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆమెకు మహిళా విభాగం బాధ్యతను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం రోజా మంత్రిగా, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. జూలై 8న వైసీపీ ప్లీనరీకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో పార్టీలో వ్యవస్థాగత మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీలు నిర్వహించి పార్టీ పదవులను భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కీలక పదవులను ప్లీనరీ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటె రాబోయే ఎన్నికల్లో కిక్ బాబు ఔట్… అండ్ సర్వ్ ద పీపుల్ మా నినాదమని..ఈ నినాదంతోనే ప్రజల్లోకి వెళతామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… 2017లో ప్లీనరీ నిర్వహించామని.. 8,9 తేదీలకు ఒక ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు. ఈ ప్లీనరీకి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారని.. అధ్యక్షుడి ఉపన్యాసంతో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అవుతాయన్నారు. పలు తీర్మానాలు, సవరణలు ప్లీనరీ ప్రతిపాదిస్తుందని వెల్లడించారు. ఐదేళ్ళ కిందట చారిత్రాత్మక ప్లీనరీని ఇదే ప్రాంతంలో నిర్వహించాం.. భవిష్యత్తు చిత్ర పటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు.