తారకరత్నను పరామర్శించిన విజయసాయి రెడ్డి

గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను బుధువారం వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. గత శుక్రవారం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం లోని హాస్పటల్ కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ కు తరలించారు. గత ఐదు రోజులుగా ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషయంగానే ఉందని డాక్టర్స్ తెలిపారు.

iబెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను ఈరోజు విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… తారకరత్న గుండె, కాలేయంతో పాటు ఇతర అవయవాలు పనిచేస్తున్నాయని చెప్పారు. మెదడులో కొంత భాగం దెబ్బతిందని..దానికి సంబంధించిన చికిత్స జరుగుతోందన్నారు. తారకరత్న చికిత్సకు సంబంధించి అన్ని విషయాలను బాలకృష్ణ చూసుకుంటున్నారని ఈ సందర్బంగా బాలకృష్ణకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.