ప్రముఖ దర్శకుడు సాగర్ మృతి

చిత్రసీమలో సినీ ప్రముఖుల మరణాలు ఆగడం లేదు. రీసెంట్ గా సీనియర్ నటి జామున మరణ వార్త అందర్నీ కలిచివేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త నుండి ఇంకా సినీ అభిమానులు , ప్రముఖులు బయటపడకముందే మరో మరణ వార్త చోటుచేసుకుంది. సీనియర్ దర్శకులు సాగర్ కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దర్శకుడు సాగర్ రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, అన్వేషణ వంటి సినిమాలను తీశారు. అలాగే తెలుగు సినిమా దర్శకులు సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సాగర్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.