తన వయసు గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన స్మితా సబర్వాల్

ఐఏఎస్ అధికారి, తెలంగాణ సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్ నిజామాబాద్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కామారెడ్డిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్బిణీలతో స్మితా సబర్వాల్ ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భాంగా స్మితా సబర్వాల్ తన వయసు గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు.

‘తల్లి కావటం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మీ చేతిలోనే మీ పిల్లలి ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం ఉంటుంది. తల్లి అయ్యాక మొత్తం సంసారం మర్చిపోతారు. నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీరు అనుకుంటారు నాకు తక్కువ వయసని.. కానీ నాకు తక్కువ వయసేమీ కాదు. మీ అందరి కంటే డబుల్ వయసు ఉంటది. నా కొడుకు వయసు ఇప్పుడు 18 ఏళ్లు. నేను మదర్ హార్లిక్స్ తాగాను. కర్జూరం తిన్నాను. మా అమ్మ ఇచ్చినవి అన్ని తిన్నాను. మంచి తిండి తింటేనే.. పిల్లల్ని చూసుకోవటం.. ఉద్యోగానికి వెళ్లి డ్యూటీ చేయటానికి కావాల్సిన శక్తి వస్తుంది. నేను అమ్మ అయిన సమయంలో నేను కూడా కలెక్టరే. మహిళలపై చాలా బాధ్యతలు ఉంటాయి. అవన్నీ నెరవేర్చాలంటే.. ముందు మీ ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. అప్పుడే అన్ని సక్రమంగా ఉంటాయి’ అని గర్బిణీలకు ఆరోగ్యం పట్ల సూచనలు తెలియజేసింది.

ఈ క్రమంలోనే “మీరు చాలా బాగున్నారు మేడం” అని ఓ గర్భిణీ అనటంతో.. సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఆ మహిళ ఇచ్చిన కాంప్లిమెంట్‌కు వెంటనే తడుముకోకుండా థ్యాంక్యూ అని సమాధానం ఇచ్చింది.