చంద్రబాబుకు బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన విజయసాయిరెడ్డి

ఎన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించిన విజయసాయి

VijayaSai Reddy- Chandrababu
VijayaSai Reddy- Chandrababu

అమరావతిః నేడు టిడిపి అధినేత చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘ టిడిపి అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని విజయసాయి ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాకు విజయసాయి దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు, టిడిపికి వ్యతిరేకంగా ఆయన ట్వీట్లు చేయడాన్ని దాదాపుగా ఆపేశారు. ఈ తరుణంలో చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలపడం అందరినీ ఆకట్టుకుంటోంది.