కశ్మీర్లో ఎన్కౌంటర్..ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్: కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా ఖుల్‌చోహార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాదళాలు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. అయితే పోలీసులు, భద్రతా బలగాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పోలీసులు తెలిపారు. వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో తెలియరాలేదని, గాలింపు కోనసాగుతున్నదని వెల్లడించారు. కాగా శనివారం పుల్వామా జిల్లాలోని చెవా ఉలార్ సమీపంలోని త్రాల్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెటాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/