చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారు


కరువు వల్ల వ్యవసాయరంగం లక్ష కోట్ల ఉత్పత్తిని కోల్పోయింది

Vijayasai Reddy
Vijayasai Reddy

అమరాతి: వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల రూ. 7,500 కోట్ల నష్టం వస్తుందని చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. మీరు పాలించిన ఐదేళ్లలో దోచుకున్నది ఐదు లక్షల కోట్లు అని అన్నారు. కరువు వల్ల రాష్ట్ర వ్యవసాయరంగం లక్ష కోట్ల ఉత్పత్తిని కోల్పోయిందని చెప్పారు. ముందు వీటి గురించి మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/