సీఎన్ఎన్ పై డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా

తనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోందన్న ట్రంప్

Trump sues CNN for defamation and seeks $475m in punitive damages

న్యూయార్క్‌ః అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ పైపరువునష్టం దావా వేశారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు గానూ 475 మిలియన్ డాలర్లకు ఆయన దావా వేశారు. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో లాసూట్ ని ఫైల్ చేశారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తాననే భయంతో తనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని తన దావాలో పేర్కొన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు… పాఠకుల మదిలో తనపై చెడు అభిప్రాయాలు నెలకొనేలా కథనాలను ప్రచురిస్తోందని అన్నారు.

తనను జాత్యహంకారిగా, రష్యాకు బానిసగా, హిట్లర్ గా, తిరుగుబాటుదారుడిగా తప్పుడు కథనాలతో పాఠకులకు చూపిస్తోందని తెలిపారు. మరోవైపు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సీఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్ తదితర మీడియా సంస్థలపై విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఫేక్ న్యూస్ అంటూ వాటిని విమర్శించేవారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/