వెంకయ్య నాయుడు అకౌంట్‌కు ‘బ్లూ టిక్’ను పునరుద్ధరించిన ట్విట్టర్
ఆరు నెలలుగా ట్వీట్లు చేయలేదని ట్విట్టర్ అభ్యంతరం
twitter-briefly-remove-verified-blue-marks-for-venkaiah-naidu-personal-account
న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి బ్లూ టిక్ ను ఆ సంస్థ తొలగించింది. అయితే, దీనిపై ఉపరాష్ట్రపతి కార్యాలయం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ట్విట్టర్ మళ్లీ బ్లూ టిక్‌ను ఇచ్చింది. గతేడాది జులై నుంచి ఈ అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా ఉందంటూ శనివారం ఉదయం వెరిఫైడ్ అకౌంట్‌ను సూచించే బ్లూటిక్‌ను ట్విటర్ తొలగించింది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్విటర్ దిగి వచ్చింది. ఈ మధ్య తన అధికారిక ఖాతాను ఆయన ఎక్కువగా వినియోగిస్తుండటంతో వ్యక్తిగత ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నదని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
వెంకయ్యనాయుడు ట్విటర్ అకౌంట్‌కు బ్లూటిక్ తీసేయడాన్ని కొందరు ట్విటరర్లు ప్రశ్నించారు. ఎన్నో ఖాతాలు ఏడాదికిపైగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నా.. వాటికి బ్లూటిక్ కొనసాగడాన్ని గుర్తు చేశారు. అటు బీజేపీ నేత సురేశ్ నకువా కూడా దీనిపై విమర్శలు గుప్పించారు. ఇది భారత రాజ్యాంగంపై చేస్తోన్న దాడిగా అభివర్ణించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/