42.34 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

రేపు ప్రారంభించనున్న జగనన్న విద్యాకానుక పథకం

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: ఏపిలో రేపు ప్రారంభం కానున్న జగనన్న విద్యాకానుక పథకంపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జగనన్న విద్యాకానుక పథకం ద్వారా రాష్ట్రంలో 42.34 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని అన్నారు. కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలతో పాటు మూడు జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌, బెల్ట్‌, నోట్‌బుక్‌లు, స్కూల్‌బ్యాగ్‌ వంటి పలు రకాల వస్తువులని తాము అందిస్తున్నామని తెలిపారు. ఒకటో తరగతి నుంచి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టారని ఆయన ట్వీట్లు చేశారు. కాగా, ఈ పథకంలో భాగంగా ఏపి వ్యాప్తంగా మొత్తం 42,34,322 మంది విద్యార్థులకు సుమారు రూ.650 కోట్ల ఖర్చుతో ఖకిట్లుగ అందజేయనున్నారు. అంతేకాదు, ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా ఇస్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/